47 ఏళ్ల వయసులో సంచలనం సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:40 PM
సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ 47 ఏళ్ల వయసులో సంచలనం సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. గయానా వారియర్స్ కెప్టెన్ వ్యవహరిస్తున్న ఇమ్రాన్ తహీర్.. సెయింట్ లూసియా బ్యాటర్లను బెంబెలెత్తించాడు.
స్పోర్ట్స్ డెస్క్: సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ 47 ఏళ్ల వయసులో సంచలనం సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. గయానా వారియర్స్ కెప్టెన్ వ్యవహరిస్తున్న ఇమ్రాన్ తహీర్.. సెయింట్ లూసియా బ్యాటర్లను బెంబెలెత్తించాడు. దీంతో గురువారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో గయానా చిత్తు చేసింది. ఈ విజయంతో గయానా జట్టు తమ అగ్రస్ధానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో గయానా కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ స్పిన్ వలలో చిక్కుకుని సెయింట్ లూసియా కింగ్స్ విలవిల్లాడారు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తహీర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల ఘనత సాధించిన జాబితాలో తహీర్ రెండో స్ధానంలో నిలిచాడు. తహీర్‌కు ఇది ఆరో ఫైవ్ వికెట్ హాల్ కావడం విశేషం. తాజాగా ప్రదర్శనతో దిగ్గజ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, రషీద్ ఖాన్,షాహీన్ షా అఫ్రిది, షకీబ్ అల్ హసన్‌లను తహీర్ అధిగమించాడు. వీరంతా ఐదుసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించారు. కాగా జాబితాలో నమీబియా మాజీ పేసర్ డేవిడ్ వీస్(7) అగ్రస్ధానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా 18.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో కమిల్ పూరన్(43), ఓబస్ పీనార్(35)లు మాత్రమే రాణించారు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని గయానా వారియర్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. గయానా బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(37), క్వెంటిన్ శాంప్సన్(37) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక 47 వయస్సులోనూ అద్భుతంగా రాణిస్తున్న తహీర్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు