Share News

ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:04 PM

సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఏఐ ఫేక్ వీడియోలను నమ్మి మోసపోవద్దని ఆమె ఆఫీస్ ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రియాంక గాంధీ వాయిస్, ముఖంతో ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారని పేర్కొంది.

ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..
Priyanka Gandhi deepfake

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఏఐ ఫేక్ వీడియోలను నమ్మి మోసపోవద్దని ఆమె ఆఫీస్ ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రియాంక గాంధీ వాయిస్, ముఖంతో ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారని పేర్కొంది. ప్రియాంక గాంధీ పేరుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవుతున్న ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ వీడియోలను క్లిక్ చేయవద్దని ప్రియాంక గాంధీ ఆఫీస్ విజ్ఞప్తి చేసింది.


సోషల్ మీడియాలో ప్రియాంక పేరుతో అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే 'రిపోర్ట్' లేదా 'బ్లాక్' చేయాలని కోరింది. పెట్టుబడుల పేరిట జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక గాంధీ ఆఫీస్ ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.


ఇవి కూడా చదవండి

పాక్ క్రికెటర్లకు చేదు అనుభవం.. హోటల్ వెలుపల నిరసనలు!

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

Updated Date - Sep 10 , 2026 | 12:08 PM