కర్ణాటకలో 37 ఏళ్ల తర్వాత మళ్లీ స్టూడెంట్ ఎలక్షన్స్
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:44 PM
కర్ణాటక ప్రభుత్వం 37 ఏళ్ల నిషేధం తర్వాత కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వెల్లడించారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: కర్ణాటక ప్రభుత్వం దాదాపు 37 ఏళ్ల నిషేధం తర్వాత కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు. కాలేజీ క్యాంపస్‌లలో హింసాత్మక ఘటనలు, ఘర్షణల కారణంతో 1989లో నిషేధించిన విద్యార్థి ఎన్నికలను మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గానీ, రాజకీయానుబంధ విద్యార్థి సంఘాలు గానీ నేరుగా పాల్గొనడానికి వీల్లేదు. విద్యార్థులు వ్యక్తిగతంగా (స్వతంత్రంగా) పోటీ చేయవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ, ప్రీ-యూనివర్సిటీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ ఎన్నికలు ప్రారంభమవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ