కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:23 PM
కనీస వేతనాలు చెల్లించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్10: కనీస వేతనాలు చెల్లించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
అయితే ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వం కమిటీ వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నదీమ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. అందుకోసం త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్
For More TG News And Telugu News