Share News

బ్రిక్స్‌ సదస్సుకు ముందు భారత్-రష్యా మధ్య భారీ డీల్..

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:54 PM

బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్-రష్యా అధినేతల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఆ సమావేశానికి ముందే, ఇరు దేశాలు 105 విమానాల భారీ ఒప్పందంపై చర్చలు ప్రారంభించాయి.

బ్రిక్స్‌ సదస్సుకు ముందు భారత్-రష్యా మధ్య భారీ డీల్..
India Russia 105 Aircraft Deal

ఇంటర్నెట్ డెస్క్: బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్-రష్యా అధినేతల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఆ సమావేశానికి ముందే, ఇరు దేశాలు 105 విమానాల భారీ ఒప్పందంపై చర్చలు ప్రారంభించాయి. రక్షణ, పౌర విమానయాన రంగాల్లో సహకారాన్ని పెంచే దిశగా ఈ డీల్‌ను కీలకంగా భావిస్తున్నారు (India Russia 105 Aircraft Deal).


భారత్‌లో ప్రాంతీయ విమానయానాన్ని విస్తరించేందుకు రష్యా 105 పౌర విమానాలను సరఫరా చేసే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఐఎల్-114-300 టర్బోప్రాప్ విమానాలు ఉండే అవకాశం ఉంది. ఈ విమానాలు చిన్న, మధ్యస్థ నగరాలను కలిపే ఉడాన్ (UDAN) వంటి ప్రాంతీయ కనెక్టివిటీ పథకాల కోసం అనువుగా ఉంటాయని రష్యా చెబుతోంది. రష్యా కేవలం విమానాలను విక్రయించడం మాత్రమే కాదు.. భారత్‌లోనే తయారీ, మెయింటెనెన్స్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అంశాలను కూడా ప్రతిపాదించింది (India Russia defence deal 2026).


సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది (Modi Putin BRICS meeting). ఈ సమావేశంలో పౌర విమానాల ఒప్పందంతో పాటు ఎస్-400, ఎస్‌యు-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బ్రహ్మోస్ అప్‌గ్రేడ్‌లు, అణుశక్తి సహకారం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా రష్యా భారత్‌కు ఎస్‌యు-57 జెట్‌లను విక్రయించడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి కూడా సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రక్షణ రంగంతో పాటు వాణిజ్య సంబంధాలను కూడా విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030 నాటికి భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి..

సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..


ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్‌లో యాపిల్ వ్యూహం ఇదేనా..

Updated Date - Sep 10 , 2026 | 07:18 PM