Share News

సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:51 PM

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని చైనా అధికారికంగా ప్రకటించింది.

సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..
Xi Jinping India Visit

ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని చైనా అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్నారు (Xi Jinping India Visit).


జిన్‌పింగ్ పర్యటనపై చివరి వరకు చైనా స్పష్టత ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బ్రిక్స్ సదస్సుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్న సమయంలో చైనా ఉత్కంఠకు తెరదించింది. జిన్‌పింగ్ భారత్ పర్యటన ఇప్పుడు ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామంగా మారింది. జిన్‌పింగ్ చివరిసారిగా 2019లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పరిణామాల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి (BRICS Summit 2026).


ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ పర్యటనను కేవలం బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే కార్యక్రమంగా కాకుండా భారత్-చైనా సంబంధాల్లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా కూడా చూస్తున్నారు (India China relations). జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ పైనే ఉంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12న సదస్సు తొలి రోజునే మోదీ జిన్‌పింగ్ భేటీ జరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అధికారికంగా ద్వైపాక్షిక సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌

47 ఏళ్ల వయసులో సంచలనం సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్

Updated Date - Sep 10 , 2026 | 04:58 PM