Share News

'వందేమాతరం'పై మళ్లీ రగడ.. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:33 PM

జాతీయ గేయం 'వందేమాతరం'పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. వందేమాతర గేయానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

'వందేమాతరం'పై మళ్లీ రగడ.. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు..
Karnataka Vande Mataram order

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ గేయం 'వందేమాతరం'పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. వందేమాతర గేయానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో 'వందేమాతరం' తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఆదేశించింది. ఈ నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది (Karnataka Vande Mataram order).


కాంగ్రెస్ నిర్ణయానికి అనుగుణంగా కేవలం తొలి రెండు చరణాలనే పాడుతామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడాలని కేంద్రం ఇటీవలె ఆదేశాలు జారీ చేసింది. 'వందేమాతరం' గేయానికి 'జనగణమన'తో సమాన గౌరవం కల్పించింది. ఇటీవల అధికారిక కార్యక్రమాల్లో పూర్తి 'వందేమాతరం' పాడటంపై కేంద్రం దృష్టి పెట్టింది (Vande Mataram row).


బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఎప్పటిలా వందేమాతరం తొలి రెండు చరణాలనే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల నిర్ణయించింది (Vande Mataram two stanzas). 1937లో కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం జాతీయ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించారు. వందేమాతరంలోని కొన్ని చరణాల్లో హిందూ దేవతలకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటం, వాటిపై ముస్లిం వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం వంటి కారణాలతో తొలి రెండు చరణాలనే కాంగ్రెస్ ఆలపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..


ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్‌లో యాపిల్ వ్యూహం ఇదేనా..

Updated Date - Sep 10 , 2026 | 05:38 PM