Share News

చిన్న భాగస్వామ్యాలే ఇలాంటి పిచ్‌పై కీలకం: హర్మన్‌ప్రీత్ కౌర్

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:57 AM

మహిళల టీ20 ఆసియ కప్ 2026లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది.

చిన్న భాగస్వామ్యాలే ఇలాంటి పిచ్‌పై కీలకం: హర్మన్‌ప్రీత్ కౌర్
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ఆసియ కప్ 2026లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది. పిచ్‌ను స్పిన్నర్లు చక్కగా ఉపయోగించుకున్నారని వెల్లడించింది. పరుగులు చేయడమే కష్టంగా ఉన్న ఇలాంటి పిచ్‌పై ఆడి గెలవడం ఆనందంగా ఉందని తెలిపింది. అయితే దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగులు తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


‘జట్టు ఈ విధంగా ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే ఆనందంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌పై సంత‌ృప్తికరంగా అనిపించాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇరుజట్ల స్పిన్నర్లు ప్రభావం చూపించారు. బ్యాటర్లు పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. ఇలాంటి పిచ్‌పై చిన్న చిన్న భాగస్వామ్యాలే కీలకంగా మారుతాయి. రిచా, దీప్తి అద్భుతంగా ఆడారు. ఇలాంటి కఠినమైన పిచ్‌పై షఫాలీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఫైనల్‌లోనూ ఇదే దూకుడుతో ఆడి కప్ కొడతాం’ అని హర్మన్ వెల్లడించింది.


ఆ బాధ్యత నాదే: షఫాలీ వర్మ

బంగ్లాదేశ్‌పై ఓపెనర్ షఫాలీ వర్మ(64) హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. మ్యాచ్ అనంతరం షఫాలీ కూడా మాట్లాడింది. ‘దుబాయ్‌లో బాగా ఉక్కపోతగా ఉంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాను. ఆరంభంలో అనుకున్నట్లుగా పేస్ దొరకలేదు. పరిస్థితికి తగ్గట్లుగా ఈ పిచ్‌పై షాట్లు ఆడాను. పవర్‌ప్లేలో బౌండరీలు, సిక్సర్లు బాదడం నా బాధ్యత. అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ ఆ దిశగానే ప్రయత్నిస్తుంటా’ అని షఫాలీ వివరించింది. భారత్‌ ఇప్పుడు టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్థాన్‌ జట్లలో విజేతతో భారత జట్టు ఫైనల్లో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై మౌనం వీడిన రోహిత్ శర్మ

ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ సాధించిన బుమ్రా... అఫ్గాన్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్

Updated Date - Sep 11 , 2026 | 07:50 AM