పాక్ చిత్తు చిత్తు
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:43 AM
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. జూనియర్ ఆసియా కప్ హాకీ సెమీ్‌సకు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్ 19-0తో పాక్‌ను చిత్తు చేసింది
190 తో భారత్ భారీ విజయం
సెమీస్ లో జూ. మహిళలు
మోకి (చైనా): చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. జూనియర్ ఆసియా కప్ హాకీ సెమీ్‌సకు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్ 19-0తో పాక్‌ను చిత్తు చేసింది. పూజా మాలిక్ (27వ, 49వ, 51వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టగా... రోషిణి (9, 60), సనిక (13, 23), సుప్రియ (40, 54), మధు సిదర్ (16, 39) తలో రెండు గోల్స్ సాధించారు. పూజా సాహూ (7), తనుశ్రీ (11), సుఖ్‌వీర్ కౌర్ (13), గీతా యాద్ (18), తనూజ టొప్పో (25), పూర్ణిమ యాదవ్ (33), కృష్ణ శర్మ (48), బినిమ ధన్ (55) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మనోళ్లకు 18 పెనాల్టీ కార్నర్‌లు, ఓ పెనాలీ స్ట్రోక్ లభించాయి. మరోవైపు పాక్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా దక్కలేదు. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై భారత ప్లేయర్లు గుక్కతిప్పుకోలేని విధంగా దాడులు చేశారు. ఈ క్రమంలో మొదటి క్వార్టర్‌లోనే ఏకంగా ఐదు గోల్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. రెండో క్వార్టర్‌లో మరో ఐదు గోల్స్ చేసిన భారత్.. మూడో క్వార్టర్‌లో మూడు, నాలుగో క్వార్టర్‌లో ఆరు గోల్స్‌తో అదరగొట్టింది.
పురుషుల సెమీస్ నేడు
శుక్రవారం మధ్యాహ్నం 2.15నుంచి జరిగే పురుషుల సెమీస్‌లో మలేసియాతో డిఫెండింగ్ చాంప్ భారత్ తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ