Share News

అజేయంగా ఫైనల్లోకి..

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:45 AM

మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. ఈ ఫార్మాట్‌లో వరుసగా ఆరోసారి ఫైనల్లో ప్రవేశించింది. క్లిష్టమైన పిచ్‌పై ఓపెనర్‌ షఫాలీ వర్మ (40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64)...

అజేయంగా ఫైనల్లోకి..

షఫాలీ హాఫ్‌ సెంచరీ

సెమీ్‌సలో బంగ్లాదేశ్‌పై గెలుపు

మహిళల ఆసియాకప్‌

దుబాయ్‌: మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. ఈ ఫార్మాట్‌లో వరుసగా ఆరోసారి ఫైనల్లో ప్రవేశించింది. క్లిష్టమైన పిచ్‌పై ఓపెనర్‌ షఫాలీ వర్మ (40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) అదరగొట్టింది. ఆ తర్వాత స్పిన్నర్లు తమ స్థాయికి తగ్గట్టు కట్టడి చేయగా, గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీ్‌సలో హర్మన్‌ప్రీత్‌ సేన 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ (24 నాటౌట్‌), రిచా (21), ప్రతికా (20) ఫర్వాలేదనిపించారు. సుల్తానాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లా తడబడింది. వెటరన్‌ దీప్తి శర్మ మూడు వికెట్లతో దెబ్బతీయడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. షోర్న అక్తర్‌ (22 నాటౌట్‌), దిలార (21) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ వర్మ నిలిచింది.

షఫాలీ దూకుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు పిచ్‌ సవాల్‌ విసిరింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ మంధాన (2) అవుట్‌ కాగా.. తొలి మూడు ఓవర్లలోనే షఫాలీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. అయినా తను మాత్రం ఎదురుదాడిని ఆపలేదు. ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా తన ఇన్నింగ్స్‌ సాగడంతో జట్టుకు విలువైన పరుగులు జత చేరాయి. మధ్య ఓవర్లలో బ్యాటర్లు తడబడ్డారు. అటు స్పిన్‌లో మెరుగ్గా ఆడే హర్మన్‌ కూడా ఇబ్బందిపడింది. తొలి నాలుగు పరుగుల కోసం 16 బంతులను ఎదుర్కొంది. చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయినా దీప్తి (13) 4,6తో 12 పరుగులు రావడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరందింది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 149/6 (షఫాలీ 64, హర్మన్‌24 నాటౌట్‌, రిచా 21; సుల్తానా 2/30).

బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 109/7(షోర్న అక్తర్‌ 22 నాటౌట్‌, దిలార 21; దీప్తి 3/26)

1.

మహిళల ఆసియాకప్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో జరిగిన ప్రతీ ఫైనల్లోనూ భారత్‌ ఆడడం విశేషం.

1

టీ20 ఫార్మాట్‌లో వేగంగా (29 మ్యాచ్‌ల్లో) 50 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత బౌలర్‌గా శ్రీచరణి. కుల్దీప్‌ (30)ను దాటేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:45 AM