ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించిన బుమ్రా... అఫ్గాన్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:43 PM
టీమిండియాకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అప్గాన్ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. అతడికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షల్లో క్లియరెన్స్ వచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్, భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్య ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అప్గాన్ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. అతడికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షల్లో క్లియరెన్స్ వచ్చింది.
బీసీసీఐ నుంచి అనుమతి రావడంతో బుమ్రా అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ద్వారా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటన సమయంలో ఎడమ మోకాలి గాయం కారణంగా కొద్దికాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో బుమ్రా ఉన్నాడు. అయితే తుది జట్టులోకి తీసుకోవడం అనేది అతడి ఫిట్‌నెస్ పరీక్షలపై ఆధారపడి ఉంటుందని జట్టును ప్రకటించిన రోజే సెలక్షన్ కమిటీ వెల్లడించింది.
తాజాగా బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరనున్నారు. త్వరలో జరగనున్న ఆసియా క్రీడల 2026(Asian Games) నేపథ్యంలో బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమిండియా మరింత బలాన్ని ఇస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. కీలకమైన టోర్నీలకు ముందు ప్రధాన పేసర్ ఫామ్‌లోకి రావడం జట్టు శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. మరోవైపు గాయం కారణంగా హర్షిత్ రాణా అఫ్గాన్ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి స్థానంలో యశ్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్
47 ఏళ్ల వయసులో సంచలనం సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్