Share News

లష్కరే తోయిబా పేరుతో ఫేక్ మెయిల్.. హైదరాబాద్‌లో పోలీసుల అలర్ట్

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:57 PM

హైదరాబాద్‌లో దాడులకు పాల్పడుతామంటూ ఉగ్రవాదుల పేరుతో వచ్చిన ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. అయితే, లష్కరే తోయిబా పేరుతో వచ్చింది మెయిల్‌ను ఫేక్ మెయిల్‌గా పోలీసులు తేల్చారు.

లష్కరే తోయిబా పేరుతో ఫేక్ మెయిల్.. హైదరాబాద్‌లో పోలీసుల అలర్ట్
Fake Terror Threat Email

హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలో దాడులకు పాల్పడుతామంటూ ఉగ్రవాదుల పేరుతో వచ్చిన ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. అయితే, లష్కరే తోయిబా పేరుతో వచ్చింది ఫేక్ మెయిల్‌గా పోలీసులు తేల్చారు. అయితే , తొలుత లష్కరే తోయిబా పేరిట వచ్చినా మెయిల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు.


నిన్న (శనివారం) రాత్రి 9:03 నిమిషాలకు హైదరాబాద్ సీపీ, స్పెషల్ బ్రాంచ్‌ను ఉద్దేశిస్తూ ఓ మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే స్పెషల్ బ్రాంచ్ అప్రమత్తమైంది. అప్పటికప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఎచ్ఓలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని స్పెషల్ బ్రాంచ్ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రంతా సోదాలు కొనసాగాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:42 PM