Share News

ఆ సూసైడ్ నోట్ ఎక్కడ..? ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సీపీ సజ్జనార్

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:22 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. సూసైడ్‌ నోట్‌, ఆధారాలున్న ఐఫోన్‌ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఆ సూసైడ్ నోట్ ఎక్కడ..?  ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సీపీ సజ్జనార్
Uday Krishna Reddy Case

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో (Uday Krishna Reddy Case) ట్విస్ట్‌ నెలకొంది. సూసైడ్‌ నోట్‌, ఆధారాలున్న ఐఫోన్‌ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయనను సీపీ సజ్జనార్ ఈరోజు (శనివారం) విచారించారు. అయితే, తాను రాసిన సూసైడ్ నోట్‌ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేశాడు. ఈ నోట్‌లో అన్ని ఆధారాలను ఐఫోన్‌లో పొందపరిచానని ఆయన రాశాడు. ఆ ఐ ఫోన్‌ను కూడా మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.


సూసైడ్ నోట్‌లో రాసిన వివరాల గురించి ప్రశ్నించినా ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను తాగిన మైకంలో రాశానని ఆయన కస్టడీలో చెప్పాడు. ఆ నోట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు తెలీదని ఉదయ్ కృష్ణారెడ్డి అంటున్నాడు. సూసైడ్ నోట్ ఎక్కడ ?? నోట్ బయటకు ఎలా వచ్చిందని సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. దానికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని సమాచారం.


వార్తలు కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 04:26 PM