Share News

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు

ABN , Publish Date - May 21 , 2026 | 09:44 PM

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంజాబ్‌ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు
HarishRao

హైదరాబాద్, మే21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) వ్యాఖ్యానించారు. పంజాబ్‌ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు. న్యూజెర్సీలోని మౌంట్ లారెల్ ప్రాంతంలోని హల్దీ వేదికగా నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్ విత్ హరీశ్‌రావు’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావుకు బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా తెలంగాణ సమకాలీన రాజకీయాలు, అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకుల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు బలపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పాలనపై విమర్శలు చేశారు. విజన్ లేని పాలన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం పెట్టుబడుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. కనీసం ఒక్క ప్లాట్ కొనుగోలు చేయాలన్నా ఎన్నారైలు భయపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే పరిస్థితులు అవసరమని తెలిపారు. అలాగే దేశ రాజకీయాలపై మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో కూడా వాటి ప్రభావం కొనసాగుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 09:47 PM