తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - May 19 , 2026 | 08:00 PM
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ముందుగా గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు (మంగళవారం) రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని వికాస్ రాజ్ సూచించారు. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు. వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అన్నారు. పండుగ వాతావరణంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్ విద్యుత్ దీపాలతో అలంకరించాలని నిర్దేశించారు. రాష్ట్ర వేడుకలకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మే 25వ తేదీ నుంచి పరేడ్ గ్రౌండ్‌లో సంయుక్త రిహార్సల్స్ నిర్వహించాలని వికాస్ రాజ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఈ-గవర్నెన్స్‌పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై కేంద్రం దృష్టి
భద్రతా దళాల సమన్వయంతో నక్సలిజంపై విజయం సాధించాం: అమిత్ షా
రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా
Read Latest Telangana News And AP News And International News And Telugu News