రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా
ABN , Publish Date - May 18 , 2026 | 05:27 PM
పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
పల్నాడు జిల్లా, మే 18 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఈ మోసం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అత్యాశకు పోయి మోసపోయిన బాధితులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.3వేల నుంచి రూ.11 వేలు కడితే విడతల వారీగా రూ.25 కోట్లు వస్తాయని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. అత్యాశకుపోయి డబ్బులు కట్టి పలువురు బాధితులు మోసపోయారు. నరసరావుపేటలో 263 మంది సహా చిలకలూరిపేట మరికొందరు.. ఇలా మొత్తం సుమారు 500 మంది నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ప్రధాన నిందితుడు చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకి చెందిన వెంకట్రావుతో సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల చర్యలు..
కేసానుపల్లి వీఆర్వో ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదైంది. నాగండ్ల వెంకట్రావు, అతని కుమారుడు వంశీ, భార్య, పీఏ నీరజలపై కూడా కేసు నమోదైంది. వీరు పలు ప్రాంతాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసి మరీ దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేటలో నిందితులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News