Share News

భద్రతా దళాల సమన్వయంతో నక్సలిజంపై విజయం సాధించాం: అమిత్ షా

ABN , Publish Date - May 18 , 2026 | 09:17 PM

దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సల్స్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.

భద్రతా దళాల సమన్వయంతో నక్సలిజంపై విజయం సాధించాం: అమిత్ షా
Amit Shah

ఇంటర్నెట్ డెస్క్, మే 18 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సల్స్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను ఈరోజు (సోమవారం) అమిత్‌ షా సన్మానించారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ని (CV Anand) సన్మానించారు. రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని (Shivadhar Reddy) సత్కారించారు. డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. మల్కాజ్‌గిరి కమిషనర్, మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతి, ఆమె బృందాన్ని అమిత్ షా సన్మానించారు.

Veluri Venkateswara Rao


బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించగలిగాం..

దేశంలో నక్సలిజాన్ని 31 మార్చి 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళిక, వ్యూహంతో ముందుకు సాగడంతో బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించగలిగామని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇది చరిత్రాత్మక మైలురాయని అభివర్ణించారు. 1970వ దశకం నుంచి మూడు తరాల పాటు దేశ ప్రజలు నక్సలిజం ప్రభావాన్ని ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు.

AMIT-SHA-1.jpg


నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు దెబ్బతినడం జరిగిందని గుర్తుచేశారు. నక్సలిజం నిర్మూలనలో దేశవ్యాప్తంగా భద్రతా దళాల జవాన్లు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. భద్రతా దళాల సమన్వయం, పట్టుదల వల్లే అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగామని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, భద్రతా దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 09:28 PM