హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. బిర్యానీ తిన్న 9 మందికి తీవ్ర అస్వస్థత..
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:22 PM
హైదరాబాద్ అంబర్‌పేటలో గల ముక్రం హోటల్‌లో మండీ బిర్యాని తిన్న ఓ కుటుంబంలోని తొమ్మది మంది ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని అంబర్‌పేటలో గల ముక్రం హోటల్‌లో మండీ బిర్యాని తిన్న ఓ కుటుంబంలోని తొమ్మది మంది ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబర్‌పేటలో నివాసం ఉండే ఓ కుటుంబం ఈ నెల 15వ తేదీన గాంధీ బొమ్మ సమీపంలోని ముక్రమ్ బిర్యానీ హోటల్‌లో మండీ బిర్యాని తెప్పించుకుని బంధువులతో కలిసి తిన్నారు. కాసేపటికి వారిలో తొమ్మిది మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై హోటల్ యజమానిని నిలదీయడంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో వారికి చికిత్సలు చేయించారు.
కాగా, అస్వస్థతకు గురైన వారిలో ఓ మహిళకు న్యూరో సమస్య తలెత్తి పరిస్థితి విషమించింది. దీంతో అస్వస్థతకు గురైన వారిని మెరుగైన చికిత్స కోసం నిన్న (బుధవారం) నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఐదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో ఏడేళ్లలోపు పిల్లలకు చికిత్సలు చేయరు.
అలాగే, అస్వస్థతకు గురైన వారి వద్ద ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి రిపోర్టులో ఓ మహిళకు న్యూరో సమస్య ఉందని పేర్కొనడంతో మెరుగైన చికిత్సల కోసం అందరినీ ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఫుడ్ పాయిజన్‌కు గురైన వారిలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తాన, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్ ఆమీర్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News