హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:06 AM
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీ చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లోని బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది. మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విషయాన్ని స్థానికులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటన ఎలా జరిగిందంటే..?
మీర్‌చౌక్ పోలీసుల సమాచారం ప్రకారం.. చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లో గల ఓ భవనం మూడో అంతస్తులో బుర్ఖా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ దుకాణంలో ఉపయోగిస్తున్న మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్న మంటగా ప్రారంభమైన ఈ అగ్నిప్రమాదం క్రమంగా పెరిగి దుకాణంలోని వస్తువులకు వ్యాపించింది. అప్పటికే అక్కడ ఉన్న వారు మంటలను చూసి భయంతో బయటకు పరుగులు తీశారు.
అయితే అగ్నిప్రమాదం సమయంలో దుకాణంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు వారికి తక్షణ చికిత్స అందిస్తూ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంజాన్ మాసంతో మార్కెట్ ప్రాంతం చాలా రద్దీగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంత కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ వారు సమర్థంగా పనిచేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
మిర్‌చౌక్ పోలీసుల చర్యలు..
ఈ ఘటన మీర్‌చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఎమ్మెల్యే పరామర్శ..
ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రిసార్ట్‌లో సౌకర్యాలు ఉండేవి ఇలాగేనా.. వారిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
Read Latest International News And Telangana News And AP News And Telugu News