రిసార్ట్‌లో సౌకర్యాలు ఉండేవి ఇలాగేనా.. వారిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:12 PM
వనస్థలిపురంలోని హరినవనస్థలి పార్క్‌లోని అనాణ్య రిసార్ట్‌ను తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో రిసార్ట్ మెయింటనెన్స్‌పై అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురంలోని హరినవనస్థలి పార్క్‌లోని అనాణ్య రిసార్ట్‌ను తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండ సురేఖ (Telangana Minister Konda Surekha) ఈరోజు (సోమవారం) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో రిసార్ట్ మెయింటనెన్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా నిర్వహణ ఓ ప్రైవేట్ సంస్థ లీజ్‌కు తీసుకుంది.
మరో రెండు నెలల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పదేళ్ల సమయంలో ఒక్కసారి మాత్రమే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించారని తెలిపారు. రిసార్టులో పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్, కాటేజ్, కిచెన్ మెయింటనెన్స్ ఎందుకు సరిగ్గా లేవని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్
Read Latest International News And Telangana News And AP News And Telugu News