ప్రత్యేక రైళ్లలో వేలాది బెర్తులు ఖాళీ.. రెగ్యులర్ రైళ్లకే ఆదరణ
ABN , Publish Date - Oct 17 , 2026 | 09:04 AM
పండుగ సీజన్లో రద్దీగా ఉన్నప్పటికీ రెగ్యులర్ రైళ్లకే ప్రయాణికుల ఆదరణ లభిస్తోంది.
ప్రత్యేక రైళ్లకు ప్రయాణికుల కొరత
పండుగ రోజుల్లోనూ రెగ్యులర్ రైళ్లకే ఆదరణ
హైదరాబాద్ సిటీ: పండుగ సీజన్లో రద్దీగా ఉన్నప్పటికీ రెగ్యులర్ రైళ్లకే ప్రయాణికుల ఆదరణ లభిస్తోంది. ప్రత్యేకరైళ్లలో ప్రయాణించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంగా ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లలో వందల సంఖ్యలో రిజర్వేషన్ బెర్తులు/సీట్లు ఖాళీగా ఉండడమే ఇందుకు నిదర్శనం. రెగ్యులర్ రైళ్లైతే పండుగ రోజుల్లోనూ సాధారణ చార్జీలే ఉండడం, రాకపోకల విషయంలో సమయపాలన పాటించడం, కోచ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుండడంతో వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేకరైళ్లు ఇందుకు పూర్తి భిన్నంగా ఎప్పుడు బయల్దేరుతాయో, ఎప్పటికి గమ్యానికి చేరుతాయో తెలియని దుస్థితి నెలకొనడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నట్లు ఆ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ప్రత్యేకరైళ్లలోని కోచ్లలో మౌలికవసతులు, రైళ్ల రాకపోకల్లో సమయపాలన పాటిస్తే, అదనపు చార్జీలు కొంత భారమే అయినప్పటికీ ప్రయాణికులు ప్రత్యేకరైళ్లకు రెండో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంటుందని ప్యాసింజర్స్ అసోసియేషన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేక రైళ్ల ఖాళీ బెర్తుల లెక్క ఇదీ..
రైలు నెంబరు మార్గం ఖాళీలు
04122 చర్లపల్లి-ప్రయాగరాజ్ 800
07041 చర్లపల్లి-సాసారాం 1600
07425 సికింద్రాబాద్-శ్రీకాకుళం 3600
07037 చర్లపల్లి-శ్రీకాకుళం 3000
07027 చర్లపల్లి-బ్రహ్మాపూర్ 3700
07065 చర్లపల్లి-బెంగళూరు 5400
07063 చర్లపల్లి-నర్సపూర్ 2800
07039 సికింద్రాబాద్-కాకినాడ 3700
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రంగారెడ్డి డీఎంహెచ్వో హెల్త్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News