ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:46 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియాను కేవలం ఐదు రోజులకే ఆ పదవి నుంచి తొలగించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియాను కేవలం ఐదు రోజులకే ఆ పదవి నుంచి తొలగించారు. ఆమె తొలి మీడియా సమావేశంలో ఎదురైన విమర్శలు, వృత్తిపరమైన అర్హతలపై తలెత్తిన ప్రశ్నలు ఈ పరిణామానికి కారణాలుగా నిలిచాయి. కాగా, మీడియా నుంచి ఆమెకు ఎదురైన విమర్శలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు (Katie Zacharia fired).
కేటీ జకారియా అక్టోబర్ 12న వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 13న ఆమె తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు 14 నిమిషాల పాటు మాత్రమే సాగింది. ఇందులో ఆమె కేవలం ముగ్గురు విలేకరుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు. దీంతో ఇతర మీడియా వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడి విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాల్సిన కీలక బాధ్యతలో ఉన్న ఆమె తొలి సమావేశం ఆశించిన స్థాయిలో సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె నియామకం, పనితీరుపై చర్చ మొదలైంది (Donald Trump about Katie Zacharia).
తీవ్ర విమర్శల నేపథ్యంలో కేటీ జకారియా పదవిలో కొనసాగడంపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు (Katie Zacharia controversy). ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. మీడియా ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తోందని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమెపై వస్తున్న విమర్శలను అనవసరమైన ఒత్తిడిగా ఆయన అభివర్ణించారు. కేటీ జకారియా వైదొలగడంతో తదుపరి ప్రెస్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా