Share News

చినుకమ్మ వచ్చేనా..?

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:50 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

చినుకమ్మ వచ్చేనా..?
rainfall

  • 22 దాకా రాష్ట్రంలో వర్షాలు

  • 13 జిల్లాలకు యెల్లో అలర్ట్‌: ఐఎండీ

  • 24 నాటికి అల్పపీడనం!

న్యూఢిల్లీ, అక్టోబరు 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌,వనపర్తి, నారాయణపేట్‌, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి తిరుపతి విమానాశ్రయం జలమయమైంది. కొత్త టెర్మినల్‌ వీఐపీ గేటు, పాత విమానాశ్రయం వీఐపీ గేటు వద్ద ప్రహరీ గోడలు కూలిపోయాయి. దీంతో వర్షపు నీరు రన్‌వేపైకి చేరుకుంది. తుపాను ప్రభావంతో తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు వాతావరణం అనుకూలించక పోవడంతో విజయవాడ నుంచి వచ్చిన విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

ఈనెల చివరి వారంలో వేర్వేరుగా అల్పపీడనాలు

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈనెల చివరి వారంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ 2 అల్పపీడనాల్లో ఒకటి బలపడి వాయుగుండం లేదా తుఫాన్‌గా మారుతుందని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమధ్యరేఖకు ఆనుకుని పశ్చిమ, మధ్య పసిఫిక్‌ సముద్రంలో సముద్ర ఉపరితల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి మరింత వేడిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు.

Updated Date - Oct 17 , 2026 | 05:52 AM