Share News

రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 07:19 AM

ఫిజియోథెరపీ క్లినిక్‌ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ కే.శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌
Rangareddy DMHO Bribery Case

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ): ఫిజియోథెరపీ క్లినిక్‌ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ కే.శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఏసీబీ అదుపులోకి తీసుకున్న శ్రీనివాసులుకు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ఈ నెల 16 వరకూ రిమాండ్‌ విధించారు. శ్రీనివాసులు రిమాండ్‌ కాలం 48 గంటలు దాటడంతో తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌-1991 ప్రకారం ఆయనపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఈ నెల 8 నుంచే ఆయనపై డీమ్డ్‌ సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీకి రూ.100కోట్లు ఇవ్వండి

ప్రజల్లోకి వెళ్లండి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 08:35 AM