ప్రజల్లోకి వెళ్లండి
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:38 AM
రాష్ట్రం ప్రకృతి విపత్తును ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రజల్లోకి వెళ్లి.. ఎల్‌నినోపై వారికి వాస్తవ పరిస్థితులను వివరించాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
ఎల్‌నినోపై వాస్తవ పరిస్థితులు వివరించండి
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మహేష్ గౌడ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ప్రకృతి విపత్తును ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రజల్లోకి వెళ్లి.. ఎల్‌నినోపై వారికి వాస్తవ పరిస్థితులను వివరించాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ప్రతి కుటుంబం నీటిని పొదుపు చేయాలని, అవసరానికి మించి నీటిని వినియోగించవద్దని కోరారు. రానున్న నెలల్లో తాగు, సాగు నీరు, విద్యుత్తుకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 209 టీఎంసీలు మాత్రమే ఉందని, వీటిని పొదుపుగా వాడుకోవాలని, లేకుంటే వేసవి నాటికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం గ్రామాల సమస్య కాదని, హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల తాగునీటి సమస్య అని, దాంతో పాటు సాగు నీరు, విద్యుత్తు, ఆర్థిక రంగాల సమస్య కూడా అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేయడం ఉద్యమంగా మారాలని, రైతులు వరి వంటి నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి రూ.100కోట్లు ఇవ్వండి
యాదాద్రి థర్మల్‌కు బొగ్గు సరఫరా చేస్తాం
Read Latest AP News And Telangana News And International