ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి రూ.100కోట్లు ఇవ్వండి
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:25 AM
కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి కోల్ ఇండియా సీఎ్‌సఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
యాదాద్రి థర్మల్ ప్లాంటుకు మహానది
బొగ్గు క్షేత్రాల బొగ్గును కేటాయించండి
కిషన్ రెడ్డికి తుమ్మల 8 వినతి పత్రాలు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి కోల్ ఇండియా సీఎ్‌సఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. దీనిపై కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు కోల్ ఇండియా ఎండీతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడారు. తుమ్మల శుక్రవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 8 అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గును మహానది బొగ్గు క్షేత్రాల నుంచి కేటాయించాలన్నారు.
సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించాలని ప్రతిపాదించారు. రామగుండం ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోతుండడంతో సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా యూరియా కేటాయించాలని కోరారు. కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అనుమతుల ప్రక్రియ ను వేగవంతం చేయాలని కోరారు. సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే లైన్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పాండురంగాపురం-మల్కన్‌గిరి రైల్వేలైన్ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది భద్రాచలంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా సారపాక వరకు రైల్వే సదుపాయం అందుబాటులోకి తేవాలని కోరారు. సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
పట్టాపగ్గాల్లేని విద్యుత్ డిమాండ్
యాదాద్రి థర్మల్‌కు బొగ్గు సరఫరా చేస్తాం
Read Latest AP News And Telangana News And International