తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:45 AM
తుంగభద్ర డ్యామ్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5 రోజులైనా ఆశించిన మేర రాని జలాలు..
రైతుల ఆందోళన
గద్వాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆర్డీఎస్ ఆనకట్టకు సహజసిద్ధంగా రావాల్సిన వరద ప్రవాహం రాలేదు. దీంతో దామాషా పద్ధతి ప్రకారం రాష్ట్రానికి వచ్చే 3 టీఎంసీ నీటిలో ఎక్కువభాగం ఎగువనే మాయమవుతుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీళ్లు చేరక తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీటి విడుదల ప్రారంభమై ఐదు రోజులు గడిచినా కూడా ఆశించిన స్థాయిలో ప్రవాహం రాకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ తరుణంలో నిర్దేశిత కోటా ప్రకారం విడుదల చేసిన నీటిలో తక్కువ పరిమాణంలోనే దిగువకు చేరడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్డీఎస్ కింద ఈ ఏడాది వరికి క్రాఫ్ హాలిడే ప్రకటించగా, రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి, మిరప పంటలను సాగు చేశారు. ప్రస్తుతం మిరపకు నీటి తడులు అత్యంత అవసరమైన దశలో ఉన్నాయి. రాష్ట్రానికి కేటాయించిన 3 టీఎంసీలలో కనీసం సగం నీరైనా సకాలంలో చేరితేనే ఈ పంటలు గట్టెక్కే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి రూ.100కోట్లు ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International