ఇక.. ఎదురుదాడే!
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:32 AM
సర్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని బీజేపీ నిర్ణయించింది. ‘మాటకు మాట’ అన్నట్టు.. కాంగ్రెస్ చేసే ప్రతి ఆరోపణపైనా స్పందించేందుకు, దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది.
కాంగ్రెస్పై పోరుకు బీజేపీ సిద్ధం
సర్, ఈసీ అంశాలపై నేరుగా ప్రజల్లోకి
న్యూఢిల్లీ, అక్టోబరు 16: సర్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని బీజేపీ నిర్ణయించింది. ‘మాటకు మాట’ అన్నట్టు.. కాంగ్రెస్ చేసే ప్రతి ఆరోపణపైనా స్పందించేందుకు, దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి జాతీయస్థాయి ప్రచారానికి కమల నాథులు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రతి అంశాన్నీ తిప్పికొట్టేలా బీజేపీ అగ్రనాయకత్వం 24 పేజీల డాక్యుమెంటును రూపొందించింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు ప్రజలను వ్యక్తిగతంగా కూడా కలుసుకుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. 24 పేజీల డాక్యుమెంటులోని అంశాలను ప్రజలకు వివరించనున్నారు.