డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడికి టోకరా.. రూ.19 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Oct 17 , 2026 | 09:49 AM
డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్లో ఓ వృద్ధుడికి సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. వృద్ధుడిని మోసం చేసి రూ.19 లక్షలు కొల్లగొట్టారు. బాలికలకు అసభ్య సందేశాలు పంపించి వేధించారంటూ 73 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్ట్ (Digital Arrest Scam) పేరుతో హైదరాబాద్లో ఓ వృద్ధుడికి సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. వృద్ధుడిని మోసం చేసి రూ.19 లక్షలు కొల్లగొట్టారు. బాలికలకు అసభ్య సందేశాలు పంపించి వేధించారంటూ 73 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. కూకట్పల్లి మాధవీనగర్కు చెందిన వృద్ధుడినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పన్నాగం పన్నారు. ఈ నెల 8వ తేదీన బెంగళూరు టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి మాట్లాడుతున్నట్లుగా వృద్ధుడికి కాల్ చేశారు. విజయ్ శర్మగా పరిచయం చేసుకొని.. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటూ బెదిరింపులకు సైబర్ క్రిమినల్స్ దిగారు.
బాలికలకు అసభ్య సందేశాలు పంపించి వేధింపులకు గురిచేశారంటూ వృద్ధుడిని బెదిరించారు. ఆ తర్వాత సీబీఐ అధికారులమని, సబ్ ఇన్స్పెక్టర్లమని చెప్పుకుంటూ వేర్వేరు వ్యక్తుల నుంచి ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి.. ఇంటి పరిసరాలను చూపించాలంటూ ఒత్తిడి చేశారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు సంబంధించి లావాదేవీలు జరిపారని నిందితులు భయపెట్టారు. ఆయా కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తామని, అరెస్ట్ కాకుండా ఉండాలంటే రూ.75 లక్షలు ఇవ్వాలని సైబర్ కేటుగాళ్లు వృద్ధుడిని డిమాండ్ చేశారు. డబ్బులు పంపించినా కూడా సైబర్ నేరగాళ్ల వేధింపులు ఆగక పోవడంతో పోలీసులకు వృద్ధుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం
మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News