చెన్నైసెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Nov 04 , 2026 | 09:52 AM
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం చెన్నై సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
చెన్నై: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం చెన్నై సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ...

నెం.-07059 చర్లపల్లి-చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు ఈ నెల 6వ తేది రాత్రి 9.30కి చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు చెన్నై చేరుకుంటుంది. మరుమార్గంలో, నెం.07060 చెన్నై -చర్లపల్లి ప్రత్యేక రైలు7వ తేది మధ్యాహ్నం 12.40కి చెన్నై సెంట్రల్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నడుస్తాయని, ఈ రైళ్ల రిజర్వేషన్ బుధవారం ప్రారంభమవుతుందని దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర
బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News