ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు
ABN , Publish Date - Nov 04 , 2026 | 09:11 AM
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పుర పోరులో కూటమి సత్తా చాటింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 83 మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరి మోగించింది. కూటమి దెబ్బకు వైసీపీ కకావికలమైంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
అమరావతి, నవంబర్ 04: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పుర పోరులో కూటమి సత్తా చాటింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 83 మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరి మోగించింది. కూటమి దెబ్బకు వైసీపీ కకావికలమైంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల మున్సిపాలిటీపైన టీడీపీ జెండా ఎగిరింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి శ్రావణి 2.58 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇక స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ మాత్రం ఒక్క కార్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఒంగోలు మేయర్ పీఠం ఇంకా తేలలేదు. ఈ నగర మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కార్పొరేషన్ పీటాలు.. విజేతలు
కడప కార్పొరేషన్: సువర్ణ (టీడీపీ)
విజయనగరం కార్పొరేషన్: భార్గవి (టీడీపీ)
విశాఖపట్నం కార్పొరేషన్: శ్రావణి (టీడీపీ)
మచిలీపట్నం కార్పొరేషన్: అబ్దుల్ అబిదా (టీడీపీ)
చిత్తూరు కార్పొరేషన్: హేమలత (టీడీపీ)
తిరుపతి కార్పొరేషన్: శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ)
గుంటూరు కార్పొరేషన్: కె. లక్ష్మీ అపర్ణ (టీడీపీ)
నెల్లూరు కార్పొరేషన్: రూప్ కుమార్ (టీడీపీ)
కర్నూలు కార్పొరేషన్: విజయ ప్రత్యూష (టీడీపీ)
ఏలూరు కార్పొరేషన్: రెడ్డి అప్పలనాయుడు (జనసేన పార్టీ)
విజయవాడ కార్పొరేషన్: వంగవీటి రాధాకృష్ణ (జనసేన పార్టీ)
వైసీపీ ఖాతాలో ...
వైసీపీ ఒక్క కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అనంతపురం కార్పొరేషన్: రమేష్ గౌడ్
నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, బేతంచర్లతోపాటు చిత్తూరు జిల్లాలోని నాయుడుపేటలో మాత్రమే వైసీపీ గెలుపొందింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే
For More AP News And Telugu News