బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:57 AM
రాష్ట్రంలో అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాదిగ, మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత దేవని సతీష్ మాదిగ కోరారు.
ఎన్నికల సంఘానికి సతీష్ మాదిగ ఫిర్యాదు
న్యూఢిల్లీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాదిగ, మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత దేవని సతీష్ మాదిగ కోరారు. దళితులపైవివక్షకు సహకరిస్తున్న కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఈసీ అధికారులకు ఆయన ఫిర్యాదు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దళితుడైన స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దూషించినా.. కేసీఆర్ ఖండించలేదన్నారు. దీన్ని నిరసిస్తూ సెప్టెంబరు 8న ‘చావు డప్పు’ కార్యక్రమాన్ని చేపట్టగా, ఆ ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ధి చేయించారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 17 ఉల్లంఘించడమేనన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News