Share News

వయసు 27, క్రిమినల్‌ కేసులు 59

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:15 AM

ఫుట్‌పాత్‌పై జీవనం, అందిన కాడికి దోపిడీ చేయడం, అడ్డు వచ్చిన వారిని హత్య చేయడం, వచ్చిన డబ్బుతో మద్యం తాగడం.. ఇదీ మలక్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో గత నెల 27న మహిళ హత్యాయత్నం కేసుల్లో ప్రధాన నిందితుడి నేర ప్రవృత్తి.

వయసు 27, క్రిమినల్‌ కేసులు 59
Crime News

  • మహిళపై హత్యాయత్నం కేసును ఛేదించిన మలక్‌పేట పోలీసులు

హైదరబాద్: ఫుట్‌పాత్‌పై జీవనం, అందిన కాడికి దోపిడీ చేయడం, అడ్డు వచ్చిన వారిని హత్య చేయడం, వచ్చిన డబ్బుతో మద్యం తాగడం.. ఇదీ మలక్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో గత నెల 27న మహిళ హత్యాయత్నం కేసుల్లో ప్రధాన నిందితుడి నేర ప్రవృత్తి. అతడి వయసు 27 కాగా నమోదైన క్రిమినల్‌ కేసులే 59 ఉన్నాయి. మంగళవారం ఠాణాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తల్లగడ్డ గ్రామానికి చెందిన కేసరి మణికంఠ అలియాస్‌ నరమ్‌దాస్‌ మణికంఠ ఎలియాస్‌ మున్నా అలియాస్‌ మణి(27) సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌ ముందున్న ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తుంటాడు.


జల్సాలకు అలవాటు పడిన అతడు గత నెల 27న మహిళపై హత్యాయత్నానికి ముందు గడ్డిఅన్నారంలోని లేడీస్‌ హాస్టల్‌లోకి వెళ్లాడు. అక్కడి మహిళలు ప్రశ్నించడంతో తాను ప్లంబర్‌నని బుకాయించాడు. దీంతో హాస్టల్‌లోని మహిళలు అతని ఫోన్‌ నంబర్‌ ద్వారా వార్డెన్‌కు ఫోన్‌ చేయించగా ఆమె లిఫ్ట్‌ చేయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి మహిళ హత్యాయత్నానికి పాల్పడి మొబైల్‌తో పరారయ్యాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు.


city5.2.jpgచోరీ చేసిన మొబైల్‌ను రూ.2వేలకు విక్రయించి వనస్థలిపురంలోని బార్‌లో మద్యం తాగుతూ పోలీసులకు చిక్కాడు. విచారించగా.. గోపాల్‌పురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో పల్సర్‌ బైక్‌ దొంగిచలించానని, ఇందుకు వరంగల్‌ జిల్లా శివనగర్‌ గ్రామ నివాసి నారపోగు వంశీకృష్ణ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజయ్‌కుమార్‌ సహరించినట్లు చెప్పాడు. దాదాపు 10కి పైగా పోలీస్ స్టేషన్ల పరిధుల్లోనే నేరాలతో వీరికి సంబంధమున్నట్లు తేలింది. కేసును మలక్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 09:22 AM