Share News

పార్వతీపురంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మాయం!

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:32 AM

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా 10 గంటలకు ప్రారంభమైంది.

పార్వతీపురంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మాయం!

పార్వతీపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా 10 గంటలకు ప్రారంభమైంది. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియకపోవడమే ఇందుకు కారణం. విషయం తెలిసిన వెంటనే పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌, ఏఎస్పీ వెంకటేశ్వరరావు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తాళాలు దొరకపోవడంతో అభ్యర్థుల అంగీకారంతో తాళాలను పగలగొట్టి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులైన స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం మేనేజర్‌ ఈశ్వరరావు, పట్టణ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సీహెచ్‌వీ నారాయణను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారి చిన్న రాయులు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 06:32 AM