Share News

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:36 PM

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపొందారు.

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం
kuppam municipal elections

చిత్తూరు, నవంబర్ 3: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. అన్ని వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కని పరిస్థితి. కుప్పంలో టీడీపీ సాధించిన విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.. 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం

విజయవాడ, విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:12 PM