విజయవాడ, విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 03 , 2026 | 02:31 PM
విజయవాడ , విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి, నవంబర్ 3: విజయవాడ, విశాఖపట్నం (జీవీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణకై మేయర్, సభ్యులకు నవంబర్ 4న ఆయా జిల్లాల కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటీసులు అందజేయనున్నారు. నవంబర్ 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఏవైనా కారణాల వల్ల నవంబర్ 9న ఎన్నిక జరగకపోతే, సెలవు రోజు అయినప్పటికీ మరుసటి రోజు నవంబర్ 10 ఉదయం 11 గంటలకు ఎన్నికను నిర్వహించనున్నారు. నవంబర్ 10న కూడా ఎన్నిక సాధ్యపడకపోతే, తదుపరి తేదీ ఖరారు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.. 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం
Read Latest AP News And Telugu News