Share News

రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్య శాఖామంత్రి

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:50 PM

రాప్తాడు బాధితురాలు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు.

రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్య శాఖామంత్రి
rapthadu victim health update

అమరావతి, నవంబర్ 3: రాప్తాడులో ఉన్మాది ఘాతుకానికి తీవ్ర గాయాలపాలైన బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


‘రాప్తాడు ఉన్మాది బాధితురాలు మాట్లాడుతోందని.. వెంటిలేటర్‌ తొలగించామని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. శస్త్రచికిత్స.. అనంతరం వైద్యులు వెంటిలేటర్‌ తొలగించారు. వైద్యుల పిలుపునకు స్పందిస్తోందని.. ఒక్కో పదం మాట్లాడుతోందని తెలిపారు. దీంతో ఐసీయూలో హైఫ్లో ఆక్సిజన్‌ సాయాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ముక్కు ద్వారా ఆహారాన్ని సజావుగా స్వీకరిస్తోందని. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. బాధితురాలు రక్తహీనతతో బాధపడుతున్న కారణంగా రక్తమార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. అవయవాల కదలికలు, ఛాతీ వ్యాయామాల కోసం ఫిజియోథెరపీ చేస్తామన్నారు. యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మందులతో పాటు ఇతర సహాయక చికిత్సలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా..’ అని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పిఠాపురం పురపాలకలో జనసేన హవా.. ఏడు వార్డుల ఫలితాల వెల్లడి

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. వైసీపీ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 01:06 PM