Share News

కొకైన్‌ దందాలో నేరగాళ్ల ఆస్తులపై ఈగల్‌ నజర్‌

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:51 AM

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాల ద్వారా ఆస్తులు కూడబెట్టిన వారికి ఈగల్‌ అధికారులు షాక్‌ ఇస్తున్నారు.

కొకైన్‌ దందాలో నేరగాళ్ల ఆస్తులపై ఈగల్‌ నజర్‌
EAGLE Telangana

  • నార్సింగ్‌ కేసులో రూ.2 కోట్ల ఆస్తుల జప్తు

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాల ద్వారా ఆస్తులు కూడబెట్టిన వారికి ఈగల్‌ అధికారులు షాక్‌ ఇస్తున్నారు. నార్సింగ్‌లో గత ఏడాది కొకైన్‌ అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు నేరగాళ్లకు సంబంధించిన రూ.2 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను నార్కోటిక్స్‌ చట్టం ప్రకారం జప్తు చేశారు. గత ఏడాది నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కొకైన్‌ విక్రయిస్తున్న శ్రీరాం అనంతకుమార్‌, వీరబాబులను ఈగల్‌ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 107 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జరిపిన విచారణలో శ్రీరాం అనంతకుమార్‌ మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు అనుమతితో వాటిని జప్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:51 AM