Share News

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య 14 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:18 AM

పండగ సీజన్‌లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య 14 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య 14 ప్రత్యేక రైళ్లు
Charlapalli Tiruvannamalai trains

హైదరాబాద్‌ సిటీ: పండగ సీజన్‌లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య 14 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ప్రత్యేకరైళ్లు ఈ నెల 6నుంచి నవంబరు 18వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. ప్రతీ మంగళవారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి( 07003 నెంబర్‌),


city6.2.jpgప్రతీ బుధవారం తిరువణ్ణామలై నుంచి చర్లపల్లికి (07004 నెంబర్‌) ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. మార్గమధ్యంలో కాచిగూడ, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, కర్నూలు, డోన్‌, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో (ఇరువైపులా) హాల్ట్‌ ఉంటుందని సీపీఆర్‌ఓ వెల్లడించారు.


city6.4.jpgవెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‏కు నందలూరులో హాల్ట్‌

కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12797/98)కు నందలూరులో (ఇరువైపులా) హాల్ట్‌ సదుపాయం కల్పించినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

చార్మినార్‌పై పనిచేయని గడియారం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 10:18 AM