ఇండియా కూటమి బాధ్యతాయుతంగా పోరాడటం నేర్చుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:50 AM
ఇండియా కూటమి ఎంపీల సుప్రీంకోర్టు మార్చ్, ఆందోళనపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఎంపీల సుప్రీంకోర్టు మార్చ్, ఆందోళనపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీలో మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం నుంచి అపాయింట్‌మెంట్ తీసుకొని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు.
బిహార్‌లో 'ఓటు దొంగతనం' జరిగిందని వారు ఆరోపించారని.. కానీ ఫలితం ఏమిటి? అని ఎంపీ ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల నుంచి ఇండియా కూటమి గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఇండియా కూటమి బాధ్యతాయుతంగా పోరాడటం నేర్చుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News