Share News

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్

ABN , Publish Date - Feb 01 , 2026 | 03:59 PM

దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్
Etela Rajender

ఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశాభివృద్ధిలో రాజీ పడకుండా ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ ఉందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వేదికగా ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గత బడ్జెట్ కంటే ఎక్కువగా రూ.1.50 లక్షల కోట్ల నిధులను గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేటయించారని వెల్లడించారు. దేశంలో 7 శాతం జీడీపీ పెరగడానికి యువత, విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టార్ట్సప్‌కి పెద్ద పీట వేశారని తెలిపారు.


యువతను ప్రోత్సహించేలా..

యువతను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వివరించారు. ప్రతి జిల్లాకు ట్రామా సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. కేన్సర్‌తో సహా 17 రకాల మందుల ధరలు తగ్గనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల వారీగా.. బడ్జెట్‌లో పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. దిగుమతులు తగ్గించుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొత్తంగా బడ్జెట్‌లో పేదలు, యువత, విద్యార్థులకు పెద్దపీట వేశారని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈటల కీలక వ్యాఖ్యలు..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే రుజువైందని తెలిపారు. సిట్‌కి లోబడి విచారణ ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 08:26 PM