అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి రేవంత్ ప్రభుత్వం భయపడుతుంది: మహేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:27 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ( Telangana Assembly Session) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు. అసెంబ్లీలో చర్చించే అంశాలపై బీజేఎల్పీ ఈ రోజు (ఆదివారం) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సభలో మాట్లాడే అంశాలపై కార్యాచరణ రూపొందించాం..
రేపటి నుంచి జరగనున్న సమావేశాల్లో మాట్లాడే అంశాలపై చర్చించామని మహేశ్వర్ రెడ్డి అన్నారు. సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అన్నివర్గాల ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు ఇంకా అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్, అవినీతి అక్రమాలపై ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. 15 రోజుల పాటు సభను నడపాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో నిలదీస్తాం: పాయల్ శంకర్

రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ఎండగడతామని బీజేఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ పాయల్ శంకర్ తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న తీరు.. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలపై ప్రశ్నిస్తామని అన్నారు. విద్యార్థుల అవస్థలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నిలదీస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను.. ఆ తర్వాత చేస్తున్న వాగ్ధానాలను సభలో ప్రశ్నిస్తామని పాయల్ శంకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News