Share News

ఢిల్లీకి కప్పం కట్టడానికి రైతుబంధు ఎగ్గొట్టారు.. సీఎంపై ఏలేటి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:28 PM

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం నుంచి బీజేపీ నేతలందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీకి కప్పం కట్టడానికి రైతుబంధు ఎగ్గొట్టారు.. సీఎంపై ఏలేటి షాకింగ్ కామెంట్స్
Maheshwar Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి(Maheshwar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం నుంచి రాష్ట్రంలోని బీజేపీ నేతలందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. తనను కూడా నిన్నటి నుంచి గృహ నిర్బంధం చేశారని ఫైర్ అయ్యారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డిపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని పాలించడం సీఎం రేవంత్‌కు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డి ఘటనపై విచారణ లేదని.. దాడికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహించారు.


బీజేపీ నేతలపై అరాచకాలు చేస్తున్నారని ఏలేటి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలనా నడుస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని సీఎం విర్రవీగుతున్నారని ఆగ్రహించారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఫామ్‌హౌస్‌లో నడిచే క్యాబినెట్ మీటింగ్‌లు.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌లో ఢిల్లీలో జరుగుతున్నాయని సెటైర్లు వేశారు. త్వరలో జరిగే ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టేందుకు.. సీఎం రేవంత్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొటాలని చూస్తున్నారని ఆరోపించారు.


ఫీ రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు ఎందుకు కట్టడం లేదని ఏలేటి ప్రశ్నించారు. ఈనెల 10న రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చిన రూ.9 వేల కోట్లను ఏం చేశారని నిలదీశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఢిల్లీకి కప్పం కట్టడం లేదా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. FRBM పరిధి దాటి మరీ అప్పులు తెచ్చి కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కుంభకోణాల కోసం ఈ రాష్ట్రం నడుస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుని రైతుబంధు, ఫీ రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనెఫిట్స్ ఇవ్వాలని మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 04:48 PM