Share News

ముస్లింల ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు చేస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 02:15 PM

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫామ్ -7పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముస్లింల ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు చేస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi

హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫామ్ -7పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లో మీడియాతో అసదుద్దీన్ మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గంలో ప్రి - ప్రింటెడ్ ఫామ్స్ లభించాయని తెలిపారు. గోషామహల్‌లో ప్రి - ప్రింటెడ్ ఫామ్ -7 ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గోషామహల్‌లో బూత్ నంబర్- 28, 30, 127లో ముస్లిం ఓటర్లే టార్గెట్‌గా ఫామ్ -7లు ఎందుకు సమర్పిస్తున్నారని నిలదీశారు.


వారిపై కేసులు నమోదు చేయాలి..

ఓ వ్యక్తి 122 ఫామ్స్ ఎలా సమర్పించారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఆ వ్యక్తి ఎవరు అన్ని ఫామ్స్ ఎలా సమర్పించారని నిలదీశారు. బల్క్‌గా ఫామ్ -7 ఇచ్చిన వాళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు. వెస్ట్ బెంగాల్‌లో ఏం జరిగిందో తమకు తెలీదని చెప్పారు. హైదరాబాద్‌లో తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులే ముస్లింల ఓట్ల గురించి ఫామ్ -7 ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటే బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.


పాత పద్ధతి ప్రకారమే సీఈసీ సెలక్షన్ ఉండాలి..

తమాషా ఎందుకు చేస్తున్నారని.. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సీఈసీ సెలక్షన్ చేసే పద్ధతి సరిగా లేదని ఫైర్ అయ్యారు. సీఈసీ సెలక్షన్ PM - LOP - CJ సమక్షంలో జరగాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతి ప్రకారమే సీఈసీ సెలక్షన్ ఉండాలని పట్టుబట్టారు. 2002లో ఓ వ్యక్తికి ఓటు హక్కు ఉందని.. కానీ ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో పేరు ఎందుకు రావట్లేదని నిలదీశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ‘సర్’లో పేరు ఎందుకు ఉండట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఈసీ ఎన్నిక పద్ధతిలో బీజేపీ తీసుకువచ్చిన చట్టం మార్చాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 03:10 PM