మూడేళ్ల పాలనలో మిగిలింది హామీలేనా? కాంగ్రెస్‌పై హరీశ్ ప్రశ్నాస్త్రాలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:47 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటన నేపథ్యంలో హరీశ్ రావు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. మూడేళ్ల పాలనలో సిద్ధిపేటకు, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
సిద్ధిపేట, నవంబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటన నేపథ్యంలో హరీశ్ రావు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. మూడేళ్ల పాలనలో సిద్ధిపేటకు, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో మిగిలింది హామీలేనంటూ ఎద్దేవా చేశారు.
‘నా మీద కక్ష ఉంటే నాపై చూపించు.. ప్రజలపై ఎందుకు? సిద్దిపేట తెలంగాణలో లేదా..? సిద్ధిపేటలో అభివృద్ధి నిధులు ఎందుకు నిలిపివేశారు? సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తరలించారు.. ఇదేనా మీ ప్రాంతీయ న్యాయం? సిద్దిపేట అభివృద్ధికి సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను నిలిపివేశారు. 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరు చేశారు.. సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదు? సిద్ధిపేట ప్రజలపై వివక్ష ఎందుకు. నా పొడుగు.. కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడేందుకు చాలా వేదికలున్నాయి.. సీఎం పర్యటన ఉద్దేశం.. ప్రజా సమస్యలను పరిష్కరించడం. ఇచ్చిన హామీలను నెరవేర్చి సిద్ధిపేటకు రా.. బోకే ఇచ్చి స్వాగతం పలుకుతా.. ’ అంటూ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
‘మూడేళ్ల పాలన.. మిగిలింది హామీలేనా? 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు బంధు ఇస్తామన్నారు.. 230 రోజులైనా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. మూడు ఆగస్టు 15లు గడిచినా రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టారా..? ఒక్క ఎకరాకు నీళ్లిచ్చారా..? నాలుగు వేల పింఛన్ ఎప్పటి నుంచి..? మహిళలకు నెలకు రూ.2,500 ఎప్పుడు ఇస్తారు..? మల్లన్నసాగర్ నిర్వాసితులకు మూడేళ్లయినా న్యాయం చేయలేదు.. బాధితుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు. 50 పడకల ఆయుష్ ఆస్పత్రి ప్రారంభించినా.. వైద్య సేవలు శూన్యం. ఇదేనా అభివృద్ధి? మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలి?’ అంటూ హరీశ్ బహిరంగ లేఖలో సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News