Share News

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:13 AM

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

  • నేటినుంచి మే 29 వరకు అందుబాటులో..

హైదరాబాద్‌ సిటీ: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 8నుంచి మే 27వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో మధ్యాహ్నం 3గంటలకు పాట్నా నుంచి చర్లపల్లికి 03253 ప్రత్యేక రైలు బయల్దేరనుంది. అలాగే చర్లపల్లి నుంచి పాట్నాకు ఈ నెల 15నుంచి మే 27 వరకు ప్రతీ బుధవారం రాత్రి 11గంటలకు 03254 ప్రత్యేక రైలు,


city2.2.jpgఈ నెల 10నుంచి మే 29 వరకు ప్రతీ శుక్రవారం 03255 ప్రత్యేక రైలు బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్రత్యేకరైళ్లు ఖాజీపేట్‌, పెద్దపల్లి, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, బలార్ష, నాగ్‌పూర్‌, గోండియ, దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలా్‌సపూర్‌, ఝర్సుగూడ, రూర్‌కెలా, హాతియా, రాంచి, బొకారో, గోమోహ్‌, పరసంత్‌, కోడెర్మ, గయ, జెహానాబాద్‌, తెరెగ్న స్టేషన్లలో (ఇరువైపులా) ఆగుతాయని ఆయన పేర్కొన్నారు.


city2.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 09:16 AM