Share News

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:18 AM

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్‌గా పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయన్ను స్టార్‌ క్యాంపెయినర్‌గా ...

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

  • భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు సైతం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్‌గా పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయన్ను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ ప్రకటించింది. మంగళవారం విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలనూ చేర్చింది. కాగా.. తమిళనాడులో తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుండగా.. అందులో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్‌ పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది.

Updated Date - Apr 08 , 2026 | 06:18 AM