Share News

విజయవాడలో హవాలా డబ్బు.. రూ.2 కోట్ల సీజ్

ABN , Publish Date - Apr 08 , 2026 | 07:52 AM

విజయవాడలో హవాలా డబ్బు కేసు సంచలనంగా మారింది. గుణదల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.2 కోట్లు పట్టుబడింది.

విజయవాడలో హవాలా డబ్బు.. రూ.2 కోట్ల సీజ్
Vijayawada Hawala case

విజయవాడ: నగరంలోని గుణదల ప్రాంతంలో హవాలా డబ్బు కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సుమారు రూ.2 కోట్లకు పైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బును ఒడిశా రాష్ట్రం నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ హవాలా డబ్బు బయటపడింది. వెంటనే నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు తరలించడానికి ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ కోసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


Also Read:

అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?

రచ్చ ఆపొద్దు!

For More Latest News

Updated Date - Apr 08 , 2026 | 08:02 AM