రచ్చ ఆపొద్దు!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:58 AM
వీకెండ్ కామెంట్’పై యాగీ ఆపొద్దని వైసీపీ నేతలను ‘తాడేపల్లి ప్యాలెస్’ నుంచి ఆదేశాలు అందాయి. సోమవారం హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానల్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా పేరిట చేసిన రచ్చ చాలదనీ...
నేడు ‘ఆంధ్రజ్యోతి’ ఆఫీసుల ముందు ధర్నాలు చేయండి
వైసీపీ నేతలకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశం
సీనియర్లందరికీ ‘జనసమీకరణ’ టార్గెట్లు
పోలీసులకూ ఎదురు తిరగాలని హుకుం
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ‘వీకెండ్ కామెంట్’పై యాగీ ఆపొద్దని వైసీపీ నేతలను ‘తాడేపల్లి ప్యాలెస్’ నుంచి ఆదేశాలు అందాయి. సోమవారం హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానల్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా పేరిట చేసిన రచ్చ చాలదనీ, మంగళవారం ఏపీలోని అన్ని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల ముందు ఆందోళనలు చేయాలని వైసీపీ పెద్దలు ఆదేశించారు. ‘‘నేరుగా సీనియర్ నేతలు రంగంలోకి దిగాలి. మహిళలను ముందు వరుసలో పెట్టి... మీరు వెనుకుండి తతంగం నడిపించండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన కార్యకర్తలను సమీకరించండి’’ అని సూచించారు. పోలీసులు అడ్డుకున్నా ఆగొద్దని, వారికి ఎదురు తిరగాలనీ ఆదేశించారు. అంతేకాదు... ‘మేం చెప్పేదాకా అక్కడి నుంచి కదలొద్దు’ అని హెచ్చరించినట్లు సమాచారం. రచ్చ ద్వారా జనంలో పాపులర్ కావాలని ‘వైసీపీ మార్కు’ సంకేతాలు పంపినట్లు తెలిసింది.