బూతు నేతల రోత గోల!
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:06 AM
వైసీపీ నేతలు ఇప్పుడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై పడీపడీ ఏడుస్తున్నారు. ‘ఏబీఎన్’లో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు.....
‘వీకెండ్ కామెంట్’పై పిచ్చి రచ్చ.. వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం
మహిళలను కించపరచడం కానే కాదు
అయినా.. నానా యాగీ చేస్తున్న వైసీపీ నేతలు
అధికారంలో ఉండగా బూతులే వారి ప్రపంచం
చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై నిత్య దూషణలు
నోరు తెరిస్తే లం.. ముం.. కొ.. ముతక పదాలే
తమ్మినేని నుంచి పోసాని వరకు అందరిదీ అదే వరస
‘ఆడంగులు’ అంటూ మహిళలను అవమానించిన రోజా
మొన్నటికి మొన్న చంద్రబాబును దూషించిన అంబటి
నేడు ‘మహిళలకు అవమానం’ అంటూ దొంగ శోకాలు
జగన్‌తో రాజకీయంగా విభేదించినందుకు, న్యాయంగా దక్కాల్సిన కుటుంబ ఆస్తుల్లో వాటా అడిగినందుకు సొంత చెల్లి షర్మిలనూ వదల్లేదు. ఆమె పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసి.. తల్లి విజయలక్ష్మినీ అవమానించేలా వైసీపీ వాళ్లే పోస్టులు పెట్టారు. అయినా.. జగన్ కిక్కురుమనలేదు. ఇదీ వైసీపీ ఘనత! అలాంటి వైసీపీ నేతలు ‘ఏబీఎన్’లో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు. ‘బూతు’లపై పేటెంట్ తీసుకున్న ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తూ, ధర్నాలకు పిలుపునిస్తున్నారు.
వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం
మహిళలను కించపరచడం, అవమానించడం కానే కాదు
అయినా... వైసీపీ నానా యాగీ
అధికారంలో ఉండగా బూతులే వారి ప్రపంచం
చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై నిత్య దూషణలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
దొంగే ‘దొంగా... దొంగా’ అని రివర్స్‌లో అరిచినట్లు...
తాము ఒంటి నిండా బురదపూసుకుని పక్కవాళ్లను ‘ఛీ.. ఛా’ అన్నట్లు...
బూతులు తప్ప మరొకటి మాట్లాడటమే రాని వాళ్లు 'అమ్మో బూతు’ అని నోళ్లు నొక్కుకున్నట్లు...
వైసీపీ నేతలు ఇప్పుడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై పడీపడీ ఏడుస్తున్నారు. ‘ఏబీఎన్’లో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు. ‘బూతు’లకు పేటెంట్ తీసుకున్న ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తూ, ధర్నాలకు పిలుపునిస్తున్నారు. నిజంగా... ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించే వ్యాఖ్యలున్నాయా? అంటే... లేనే లేదు. ‘జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది’ అని తలలూపుతున్నారని... అమరావతి, మూడు రాజధానులు, మావిగన్ విషయంలోనూ అదే వైఖరి ప్రదర్శిస్తున్నారని సూటిగా, ఘాటుగా చెప్పడమే ‘వీకెండ్ కామెంట్’లోని ఆ వ్యాఖ్యల ఉద్దేశం. ‘భార్య కాదు చెల్లి అని జగన్ చెప్పినా అలాగే అనుకునే పరిస్థితుల్లో ఉన్నారనే’ వ్యాఖ్యలు జగన్‌కు వంతపాడే వైసీపీలోని కొందరు పురుష నేతల మానసిక స్థితిని తెలిపేందుకు వాడినవే! అంతే తప్ప మహిళలను ఉద్దేశించి అన్నవి కావు. మహిళలను కించపరిచే ఉద్దేశమూ అందులో లేదు. ఆ పని చేసిందీ, చేసేదీ వైసీపీ నేతలే! లం... లం కొ, ముం.. ఇవి వారి నోళ్లలో అలవోకగా దొర్లుతాయి.

పోసాని, అంబటి అయ్యబాబోయ్...
వైసీపీ నేతల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరే వేరు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనేం చేశారో, ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ఇప్పుడు... విపక్షంలోకి వచ్చాకా ఆయనది అదే తీరు! ‘‘...రమ్మను... వాళ్లమ్మా మొగుడిని రమ్మను... లం...కొ’’ అని మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబును పేరు పెట్టి తిట్టారు. మరి... ఇది మహిళలను గౌరవించడమా? అరెస్టయ్యాక సైలెంట్ అయ్యారుకానీ... సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ‘నోటి’ మాటేమిటి? చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లను ఆయన తిట్టిన తిట్లు ఎలాంటివి? అవి... మహిళలను కించపరిచేవి కావా? ‘ఆ బిడ్డలు నీకు పుట్టలేదట... ఇంకెవరికో పుట్టారట!! అలాంటి దొం..లం..కొ.. అసలేమసలే!’ అని మైకు ముందే పోసాని కృష్ణ మురళి నోరు మురికి చేసుకోలేదా? ఇక... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రోడ్‌షోలోనే లం..కొ.. అంటూ కూటమికి చెందిన కీలక నాయకుడిని తిట్టిపోయలేదా?
‘ఆంధ్రజ్యోతి’నీ లక్ష్యంగా చేసుకుని...
తప్పును తప్పు... అని సూటిగా ఘాటుగా చెప్పడం ‘ఆంధ్రజ్యోతి’ నైజం. దీనిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేరు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, ఇప్పుడూ... వైసీపీది ఒకటే అజెండా! అది ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు కక్కడం. ఇందులో భాగంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణనూ లక్ష్యంగా పెట్టుకుని అనేక అసభ్య, అహేతుక పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాటిని మళ్లీ తెరపైకి తెచ్చి ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.

రోజా.. బూతు!
ఆడవాళ్లు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రోజులివి! గాజులు, చీర సంస్కృతిలో భాగ మే తప్ప... చేతగానితనానికి ప్రతీకలుగా భావిం చే కాలం పోయింది. కానీ... వైసీపీ నాయకురాలు రోజాకు మాత్రం ఇవేవీ పట్టవు. ‘ఆడంగి వెధవ లు’ అని తిట్టడం ఆమెకు చాలా ఇష్టం! ‘చీర, చుడీదార్ పంపిస్తా కట్టుకో!’... అంటూ మహిళల వస్త్రధారణను ఎద్దేవా చేశారు. ‘పడుకోబెట్టుకోవడం, పడుకోవడం’ వంటి పదాలూ వాడారు. ఇక... వైసీపీ హయాంలో... ‘రెండు రేప్‌లకే ఇంత రాద్ధాంతమా!?’ అంటూ మహిళల మానాలకు విలువే లేనట్లు మాట్లాడారు. మహిళలను అత్యంత దారుణంగా అవమానించేందుకు వాడే పదం ‘లం’! అది రోజా నోట ఎన్నోసార్లు అలవోక గా దొర్లిపడింది. అలాంటి రోజా ఇప్పుడు ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారని... ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలను తగలబెడతామని తెగ ఆవేశ పడుతుండటమే చిత్రం!
తిట్టడమే కదా మీ పని..
‘గట్టిగా తిట్టే కార్యక్రమం పెట్టుకోండి’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి ఎవ్వరూ మరిచిపోరు. ఇక... వయసులో పెద్దాయన, స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం లం.. పదంతో సహా పలుమార్లు పచ్చి బూతులు మాట్లాడారు. అవి... మహిళలను కించపరిచేవే. ఇక... టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు చురుకుగా ఉన్న మహిళా నేతను ఉద్దేశించి వైసీపీకి చెందిన మరో మహిళా నాయకురాలు... వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పచ్చి బూతులు తిట్టారు. అవి రాయాలంటే అక్షరాలే సిగ్గుపడతాయి. ఇక కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయనకు జనంపెట్టిన పేరే ‘బూతుల మంత్రి’! చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా తిట్టిపోశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆయన నోటికి అడ్డేలేదు. పిచ్చికుక్క, గజ్జికుక్క, సన్నాసి, చవట, గాలినాయుడు, బొచ్చుగాడు, లుచ్చాగాడు, బఫూన్, నిత్య దరిద్రుడు... ఇలా రాస్తూ పోతే ఇంకెన్నో! ‘తండ్రి/నాన్న’ అనకుండా... ‘నీయమ్మా మొగుడు’ అని నోరుపారేసుకున్న చరిత్ర కొడాలి నానిది!